నిజమైన ప్రజా సేవకురాలు వెట్రి సెల్వి
ప్రజాసేవే పరమావధిగా…
ప్రజాసమస్యలపై ప్రతిస్పందిస్తూ…
వరదల్లో సైతం వీర వనితలాగా..
పేదప్రజల పట్ల ప్రేమాభిమానాలు కలిగి..
రాజకేయ పార్టీలతో రగడ లేకుండా..
అధికారుల్లో అలమరికలు తలెత్తకుండా..
ప్రభుత్వ ఆశయాలపై అకుంఠిత దీక్షతో అడుగులు వేస్తూ..
అభివృద్దే లక్ష్యంగా ముందుగు సాగుతూ
జిల్లా సర్వతోముఖాభివృద్దికి చక్కటి చర్యలు తీసుకుంటూ..
శభాష్ అనిపించుకుంటున్న సెల్వీ

(మత్తే బాబి ,ప్రజాభూమి స్పెషల్ కరెస్పాన్డెంట్, ఏలూరు)
ఐఏఎస్ అంటే ఏసీ హాలుకు పరిమితమై ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటాయని ప్రజల్లో ఉన్న ఓ చిన్న పాటి అనుమానం కూడా లేకుండా ఐఏఎస్ అంటే ప్రజాసేవే పరమావధిగా ముందుకు పోవడమేనని ప్రణాళిక బద్దంగా ప్రజా సమస్యలపై చక్కటి పరిస్కారం చూపుతూ ప్రజల్లో శభాష్ అనిపించుకుంటూ చక్కటి పాలన అందిస్తున్న యువ ఆశాకిరణం.ఆకస్మిక వరదల్లో అయ్యో ఎలా అనుకోకుండా అడుగు తీసి అడుగు వేయలేని ఆ రహదారులలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆపన్న హస్తం కోసం ఎదురు చూసే ఆయా ప్రాంత ప్రజల వద్దకు వెళ్లి ఆందోళన వద్దని ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుందని అక్కడి వారి బ్రతుకుల్లో ఆశలు నింపి,వ్యాపారం కోసం విచ్చల విడిగా దోచేస్తున్న పిడిఎస్ పై కన్నెర్ర చేస్తూ కలెక్టర్ అంటే ఇలా అని జనం మెచ్చిన ఏలూరు యువ కలెక్టర్ వెట్రి సెల్వీ పై ప్రజాభూమి అందిస్తున్న నూతన సంవత్సరంలో ప్రత్యేక కథనం .. జూన్ 26 2020 బుధవారం నాడు ఏలూరు జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జిల్లా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న మన యువ కలెక్టర్ వీరవనిత మన నిజమైన ప్రజా సేవకురాలు ఏలూరు జిల్లా కలెక్టర్ ఐఏఎస్ కె వెట్రి సెల్వి.ఏలూరు జిల్లాలో పాలనలో తనదైన మార్క్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదలను సమర్థవంతంగా ఎదుర్కొని ఏలూరు జిల్లా ప్రజలకు ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం కలగకుండా ప్రజలను,అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసిన అడ్మినిస్ట్రేటర్, మాదకద్రవ్యాలను నిర్మూలించాలన్నా,కోడి వ్యర్ధాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నా, పేదవారికి చెందాల్సిన అక్రమ రేషన్ బియ్యం అరికట్టాలన్నా, మీకోసం అర్జీల సమస్యల పరిష్కారమైనా, క్రీడాకారుల్ని ప్రోత్సహించాలన్నా, డయేరియా వంటి విష జ్వరాల కేసులను ప్రబలకుండా నివారించాలన్నా,పెన్షన్ల పంపిణీ అయినా, ప్రజా జీవితంకై అంకితమై పనిచేస్తున్న ఏకైక లేడీ బాస్ ఇంకెవరు ప్రజల మెచ్చిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఏలూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా సంక్షేమం జిల్లా అభివృద్ధికై కె వెట్రి సెల్వి చేసిన కృషి అనిర్వచనీయం * గోదావరి జిల్లాల ప్రజల కలల ప్రాజెక్టు పోలవరం నిర్మాణ పనులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వివరాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, ప్రతినెల 2.68 వేల మంది లబ్ధిదారులకు ఒకటవ తారీఖున ఆరు గంటల నుండి పెన్షన్ పంపిణీ చేస్తూ, మత్స్య సాగు రైతులకు నిపుణులతో కలిసి అవగాహన కల్పిస్తూ, పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు * 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ సైనికులు మంత్రి కొలుసు పార్థసారధితో కలిసి సత్కారం చేయడమే కాకుండా,ఆకస్మికంగా అంగన్వాడి కేంద్రంలో చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు* ప్రభుత్వ పాఠశాలలో సైతం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ, రికార్డులు పరిశీలిస్తూ అక్కడ ఉన్న విద్యార్థినీ విద్యార్థులతో కలిసి భోజనం ఆరగించడమే కాక వారినే సదుపాయాల వివరాలు స్వయంగా తెలుసుకుంటున్నారు * పిల్లలు లేని వారికి పిల్లల్ని దత్తతగా అందజేస్తూ వారికి ఆనందాన్ని పంచుతున్నారు, * ఇల్లు లేని నిరుపేదలకు ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం 2.0 లో భాగంగా పూర్తయిన ఇండ్ల తాళాలను లబ్ధిదారులకు అందజేస్తూ జిల్లాలో విమర్శికుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు * ఇటువంటి ప్రజల మెచ్చిన జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి ఈ నూతన సంవత్సరంలో ఏలూరు జిల్లా అభివృద్ధిని, ఖ్యాతిని,సంక్షేమాన్ని రెట్టింపు చేయాలని ప్రజా భూమి పత్రిక కూడా ఆకాంక్షిస్తుంది.