Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుబూతులు మాట్లాడుతున్న నాయకులకు బుద్ధి చెప్పండి: వెంకయ్య నాయుడు

బూతులు మాట్లాడుతున్న నాయకులకు బుద్ధి చెప్పండి: వెంకయ్య నాయుడు

విశాఖ:బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్ లో బుద్ధి చెప్పండని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు యువతకు పిలుపు ఇచ్చారు. ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు సంస్కారాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్నారని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీలలో కొందరు నేతలు అపహాస్యపు పనులు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారికి పోలింగ్ బూత్ లలో సమాధానం చెప్పాలని అన్నారు. చదువు ఎంత ముఖ్యమో, సంస్కారం కూడా అంతే ముఖ్యమని అన్నారు. స్థాయి మరిచి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. విశాఖలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాతృభాష కళ్లు లాంటిదని… తల్లిలాంటి భాషను ఎవరూ మర్చిపోకూడదని వెంకయ్య .. విలువలతో కూడిన విద్య ఉంటేనే విలువలతో కూడిన పౌరుడిగా తయారవుతారని అన్నారు. ఇప్పుడు విలువలతో కూడిన విద్య తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article