గొల్లప్రోలు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మ దినోత్సవం గొల్లప్రోలు లో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా గ్రామంలో అమ్మవారిని రథంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.తదుపరి శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఆడపడుచులు అందరిచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్య సంఘం ప్రెసిడెంట్ దర్శిపూడి సురేష్,సెక్రటరీ కేదారిశెట్టి వివి చలపతిరావు( నానాజీ), ట్రెజరర్ శ్రీ గ్రంధి సత్యనారాయణ,జాయింట్ సెక్రెటరీ కేదారిశెట్టి నానాజీ, వైస్ ప్రెసిడెంట్ శ్రీ కొత్త గణేష్,శ్రీ సీతారామ స్వామి దేవస్థానం చైర్మన్ దర్శిపూడి వీర రాఘవులు,వూర సుబ్బారావు, కుసుమంచి పాపారావు, దంగేటి శ్రీ రామకృష్ణ, గ్రంధి లచ్చన్న తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.