ఏలేశ్వరం:-ప్రతిపాడు నియోజకవర్గం వైకాపా ఇంచార్జ్ వరుపుల సుబ్బారావు వెంటే మేమంతా అని మండలంలోని పేరవరం గ్రామం సర్పంచ్, ప్రజలు అంటున్నారు. బుధవారం సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి వరుపుల ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతుల బేరి సూర్య వరలక్ష్మి, బేరి అరవింద్ కుమార్ (అచిబాబు) మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వరుపుల సుబ్బారావు అంటే మా గ్రామ ప్రజలకు ఎంతో అభిమానం అని ఆయన పదవులొ ఉండగా గ్రామాని ఎంత అభివృద్ధి చేశారని కొనడారు. వరుపులు మాట్లాడుతూ పేదల సంక్షేమమే తన సంక్షేమంగా భావించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తొందర్లోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో నాగులపల్లి వీర భద్రారావు,కర్రి వీరా స్వామి, తటపుడి చక్రారావు, కడారి చంద్రరావు,నేపురి కొండబాబు, బొడ్డు సూరిబాబు గారు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.