Saturday, February 21, 2026

Creating liberating content

తాజా వార్తలుహోంమంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించిన వంగలపూడి అనిత‌

హోంమంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించిన వంగలపూడి అనిత‌

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు కలసి అభినందనలు తెలిపారు. బొకేలను అందించి ఆమెకు శుభాకాంక్షలను చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక మహిళ హోం మంత్రిగా బాధ్యతలను స్వీకరించడం ఇదే తొలిసారి. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article