తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన దేశవ్యాప్తంగా ప్రక్షాళనలతో చర్చకు దారి తీసింది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కల్తీ వ్యవహారంతో పాటు శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిలో వచ్చిన దోషం వలన అపచారం చోటుచేసుకుందని టీటీడీ ఈఓ శ్యామలరావు వెల్లడించారు. ఈ దోషం నివారణ కోసం తిరుమల ఆలయంలో యాగశాలలో అర్చకులు శాంతి హోమం నిర్వహిస్తున్నారు.ఈ రోజు ఉదయం 10 గంటల వరకు టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ హోమంలో టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. హోమం పూర్తి అయిన తర్వాత ఆలయంలో అన్ని పోటుల్లో సంప్రోక్షణ నిర్వహిస్తామని ఈఓ శ్యామలరావు తెలియజేశారు, తద్వారా అపచారం నివారణ చేయబడుతుందని అన్నారు.