టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ తాను త్వరలో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన భార్య భూమా నాగ మౌనిక రెడ్డి గర్భవతి అని వెల్లడించారు. మంచు మనోజ్, భూమా మౌనికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో గత ఏడాది మార్చిలో వారి వివాహం వేడుకగా జరిగింది. తండ్రి కాబోతున్నట్లు మంచు మనోజ్ ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా భూమా మౌనిక తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన పోస్ట్‌కు భర్త మనోజ్‌ను, తన మొదటి కొడుకు ధైరవ్‌ని ట్యాగ్ చేసింది. మౌనిక చేసిన పోస్ట్‌కు మంచు మనోజ్ సరదాగా కామెంట్ చేశాడు. పిల్లా..ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం భూమా మౌనిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోలు చూసిన మంచు మనోజ్ అభిమానులు ఆ దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.