పారిశుద్ధ్యన్ని గాలికి వదిలేసిన పంచాయితీలు! రానున్న వర్షాల్లో తమ పరిస్థితి ఏమిటని? ఆందోళన వ్యక్తం చేస్తున్న పలు గ్రామాల ప్రజలు!

వేలేరుపాడు:వేలేరుపాడు మండలంలో పారిశుధ్య పనులను గ్రామపంచాయతీయులవారు పట్టించుకోకపోవడంతో, దుర్బ ల వాతావరణం నెలకొందని ఈ పరిస్థితుల్లో రానున్న వర్షాకాలంలో తమ జీవితాలు ఏ వ్యాధులతో ఏమి కావాల్సి వస్తుందో అన్న ఆందోళనలను పలు గ్రామాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా ఉన్నతాధికారులు పారిశుధ్య పనులపై దృష్టి పెట్టాలని ,ఇప్పటికే పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ,స్థానిక గ్రామపంచాయతీలు, కార్యదర్శులు ఆ వైపుగా కనీసం శ్రద్ధ శక్తులు చూపకపోవడం విడ్డూరంగా ఉందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు, డ్రైనేజీలు పూడిపొవటంతో ఎక్కడికక్కడ వాడకాల నీరు, వర్షపు నీరు నిల్వ ఉండి, దుర్భర వాసన నెలకొందని, ఈ గుంటల్లో దోమలు వృద్ది చెంది పలు రకాల వ్యాధులకు దోహదమవుతాయని పేర్కొంటున్నారు, ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకపోయిందని వాపోవటం ప్రజలవంతయింది, కేవలం సంబంధిత అధికార యంత్రాంగం స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి పరిమితం కావటం, సమయం ఎప్పుడు అవుతుందా! అని చూసి వారు నివాసముండే తెలంగాణలోని అశ్వరావుపేట తదితర గ్రామాలకు వెళ్లిపోవడం నిత్య కృత్యంగా మారిందని ఆరోపిస్తున్నారు, పైనుంచి అధికారులు ఎవరైనా వస్తున్నారని తెలిస్తే మాత్రం మండల కేంద్రంలోని ప్రధాన కార్యాలయాల్లో బ్లీచింగ్ పిచికారి చేయడం జరుగుతుంది తప్ప గ్రామాల్లో ఎక్కడ పిడికెడు బ్లీచింగ్ పిచికారి చేయడం లేదన్న ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి పలు గ్రామాల్లో నెలకొన్న దుర్భర వాతావరణాన్ని మెరుగుపరిచి పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో శ్రీహరిని వివరణ కోరగా తక్షణం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్యలను పరిష్కరించగలమని పేర్కొన్నారు.
