Sunday, February 22, 2026

Creating liberating content

తాజా వార్తలుతిరుపతి ప్రతిష్టను పెంపొందిస్తాం.. ఎస్పీ సుబ్బారాయుడు

తిరుపతి ప్రతిష్టను పెంపొందిస్తాం.. ఎస్పీ సుబ్బారాయుడు

తిరుపతి జిల్లా ప్రతిష్టను పెంపొందించేలా తమ పనితీరు ఉంటుందని ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… జిల్లా ప్రజలు పోలీస్ శాఖకు తమ సహకారం అందించాలన్నారు. శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతామన్నారు. పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు శాంతి భ‌ద్ర‌త‌ల‌ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా పోలీసులకు సహకరించాలన్నారు.చట్టానికి లోబడి పోలీస్ శాఖ పనిచేస్తుందని, చట్ట వ్యతిరేక కార్యక‌లాపాలకు పాల్పడే వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సుబ్బారాయుడుకు పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article