Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలునేడే తిరుమల ప్రక్షాళన పాదయాత్ర.. ముఖ్య అతిథుల ఆగమనం!

నేడే తిరుమల ప్రక్షాళన పాదయాత్ర.. ముఖ్య అతిథుల ఆగమనం!

ఆర్సీవై పాదయాత్రకు దేశ వ్యాప్త స్పందన
ఆరంభ కార్యక్రమానికి విచ్చేయనున్న ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులు..
తిరుమల పరిరక్షణ పాదయాత్ర రేపే ప్రారంభం
పుంగనూరు నుండి తిరుమల వరకు నడక

ప్రత్యేక కార్యక్రమంగా భక్తిశ్రద్ధలతో మెట్లోత్సవం..పరమ పవిత్ర పుణ్య క్షేత్రంలో జరిగిన పాప ప్రక్షాళన.. తిరుమల క్షేత్ర పవిత్రత రక్షణ.. కోట్లాది భక్త జన మనోభావాల పరిరక్షణ.. లక్ష్యంగా నేటి నుండి రామచంద్ర యాదవ్ తలపెట్టిన “తిరుమల పరిరక్షణ పాదయాత్ర”కి విశేష స్పందన వస్తోంది.. దేశ వ్యాప్తంగా సామాన్య భక్తజనం మద్దతుతో సహా.. ఆధ్యాత్మిక ప్రముఖులు, గురువులు, పీఠాధిపతులు నేరుగా హాజరు కానుండడం విశేషం.. పుంగనూరులోని హనుమతరాయ దిన్నె వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆరంభ కార్యక్రమానికి..* శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య వంశ పరంపర, శ్రీ యదుగిరి యతిరాజ్ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు..* శ్రీ మహంత్ కళ్యాణ్ దాస్ జీ మహరాజ్ (హనుమాన్ మఠం పీఠాధిపతి, అయోధ్య) విచ్చేయనున్నారు..* శ్రీపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ విచ్చేయనున్నారు..* త్రిశక్తి మంత్రాశ్రమ సిద్దయోగులు.. శాక్తేయా సాంప్రదాయ సదాచార సంపన్నులు శ్రీ శ్రీ శ్రీ ఆడిదండి శక్తిశ్రీ భగవతీ మహారాజ్ స్వామి వారు విచ్చేయనున్నారు..* శ్రీ క్రిష్ణ యాదవానంద స్వామీజీ (యాదవ గురుపీఠం, కర్నాటక) కూడా విచ్చేయనున్నారు..ఈ ప్రముఖులతో సహా కంచి పీఠం నుండి గురువులు, స్వామీజీలు, ఇతర ప్రాంతాల నుండి ప్రముఖ స్వామీజీలు రానున్నారు..సమున్నత లక్ష్యం.. భక్తజనం సిద్ధం..!తిరుమల పూర్తిస్థాయి ప్రక్షాళన సహా ప్రధానమైన ఏడు డిమాండ్ల సాధన కోసం పాదయాత్ర మరియు మెట్లోత్సవం చేయాలని సంకల్పించారు.. పుంగనూరు నుండి అలిపిరి వరకు పాదయాత్ర ద్వారా చేరుకుని.. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకోనున్నారు. అలిపిరి నుండి తిరుమల వరకు “మెట్లోత్సవం” కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఈ పాదయాత్ర సహా మెట్లోత్సవం కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.. తిరుమల రక్షణ కోసం, పవిత్రత కోసం, ప్రక్షాళన కోసం భక్తులు ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనాలనీ రామచంద్ర యాదవ్ కోరారు..షెడ్యూల్ ఇదే.. తరలిరండినేటి ఉదయం 9.15 నుండి పుంగనూరులోని హనుమంతురాయ దిన్నెలో ఉన్న వీరాంజనేయస్వామి దేవాలయం నుండి పాదయాత్ర ఆరంభం కానుంది.. అక్కడి నుండి చౌడేపల్లి, సోమల, సదుం, కల్లూరు, పులిచర్ల, రొంపిచర్ల క్రాస్, శ్రీనివాస మంగాపురం మీదుగా అలిపిరి నుండి తిరుమల వరకు సాగనుంది.. ఈ నెల 30-09-2024 ఉదయం 9.15 గం. అలిపిరి నుంచి తిరుమల మెట్లోత్సవం జరగనుంది..ఏడు డిమాండ్లతో ఏడు కొండల వాడి చెంతకు..100 రోజుల్లో శిక్ష – తిరుమలలో జరిగిన అపచారాలు, అవినీతి అక్రమాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి 100 రోజుల్లో దోషులను శిక్షించాలిపరిపాలన ప్రక్షాళన – TTD పాలక మండలి నుండి పరిపాలన వరకు పూర్తి ప్రక్షాళన పాలక మండలిలో రాజకీయ, కార్పొరేట్ శక్తులకు చోటు కల్పించకూడదుసమప్రాధాన్య దర్శనం – VIP దర్శన విధానాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి నుండి సామాన్య భక్తుని వరకు అందరికీ ఒకే విధమైన దర్శన ఏర్పాటు చేయాలిఅన్యమత ఉద్యోగులు, వేయి కాళ్ళ మండపం – TTD లో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.. తొలగించబడిన వేయికాళ్ళ మండపాన్ని వేరొక చోట వెంటనే నిర్మించాలిమద్య, మాంస దుకాణాలు – తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి, కపిలతీర్థ, తిరుచానూరు అలివేలు మంగాపురం ఆలయాలకు కనీసం 2 కి.మీ పరిధిలో మాంసం, మద్యం దుకాణాలు నిషేదించాలిపబ్లిక్ ఆడిట్ – తిరుమల ఆదాయ, వ్యయాలపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహించి నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచాలితిరుమలలోనే డెయిరీ – తిరుమలలోనే గోశాల ఏర్పాటు చేసి తద్వారా సొంతంగా డెయిరీ నిర్వహించి ఆ నెయ్యిని మాత్రమే స్వామి వారి ప్రసాదాలలో వినియోగించాలిఈ ఏడు డిమాండ్ల సాధన కోసం ఆర్సీవై పాదయాత్ర జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article