Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుతిరుమల లడ్డూ వ్యవహారం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం :డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తిరుమల లడ్డూ వ్యవహారం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం :డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘వైసీపీ హయాంలో పనిచేసిన TTD బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేశంలోని దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలి. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసిరావాలి. బోర్డు ఏర్పాటుపై చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు.తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. తిరుమల శ్రీవారిని కోట్లాది మంది భక్తులు ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు. అలాంటి తిరుమల లడ్డు గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారంగా మారాయి. మరోవైపు భక్తుల మనోభావాలు కూడా ఆందోళనకు గురయ్యే విషయం అనిచెప్పవచ్చు. చంద్రబాబు ఇటీవల మాట్లాడుతూ.. గత వైసీపీ సర్కారు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వులను ఉపయోగించిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ సర్కారు తిరుమల పవిత్రను అత్యంత దిగజార్చాడంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీంతో నిన్నటి నుంచి ఒక్కసారిగా రాజకీయంగా దుమారంగా మారింది. దీనిపైన వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది.తిరుమల లడ్డు నాణ్యతపై..అనేక ఫిర్యాదులు అందడంతో.. జులై 8, 2024న ల్యాబ్‌కు పంపించగా.. జులై 17న ఈ మేరకు ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడినట్లు కూడా బైటపడింది. ముఖ్యంగా.. ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలు వాడినట్లు రిపోర్టులో బైటపడింది. దీంతో గత వైసీపీ సర్కార్ ఫై యావత్ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article