మార్కాపురం:మార్కాపురం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని వివేకానంద విద్యాపీఠం నుండి విద్యార్థులతో 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ తిరంగా ర్యాలీని రాష్ట్రీయ స్వయంసేవక్ నెల్లూరు విభాగ్ ప్రచారక్ నవీన్, పాఠశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున లు జెండా ఊపి తిరంగా ర్యాలీని ప్రారంభించారు. ఈ తిరంగా ర్యాలీ వివేకానంద విద్యాపీఠం నుండి పట్టణంలోని నాలుగు మాడవీధులలో విద్యార్థులతో వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలతో పట్టణ పురవీధులు మారుమ్రోగాయి.. ఈ సందర్భంగా 77 సంవత్సరాల స్వతంత్రo లో దేశ ప్రజలందరూ ప్రతి ఇంటా జరుపుకునే గొప్ప పండుగ స్వాతంత్ర దినోత్సవమని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకొని దేశ సమైక్యతను తెలియజేయాలని పలువురు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంపర్కు ప్రముఖు కాలం రాజు రామకృష్ణ, పాఠశాల సెక్రటరీ దేవిశెట్టి చంద్రశేఖర్, ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ అంజిరెడ్డి, ఏబీవీపీ నగర కార్యదర్శి పవన్ కుమార్, ఏవిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శశిoద్ర, జిల్లా ఎస్ ఎఫ్ డి కన్వీనర్నారాయణ,వెంకటేశ్వర్లు ,భాను తేజ, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

