-అక్రమ సంపాదనే అలవాటుగా ..
-వెల్డర్ నుంచి జర్నలిస్టు గా అవతార మెత్తి…
-అక్రమ మద్యాన్ని జీడీ పిక్కల మాటున జేర్చి…
-పోలీసులు అరెస్ట్ చేసినా… జైలుకు వెళ్లినా..
-ఆ సంస్థ తన్ని తరిమివేస్తే…
-అక్రమంగా అక్రిడేషన్ పొంది ..
-అక్రమ రేషన్ దారులతో ఆమ్యామ్యా చేస్తూ…
-కులం పేరుతో కాపు కాస్తూ…
-అన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లిస్ట్ ఇస్తూ…
-అక్రమ రేషన్ దారులకు అండగా ఉంటానంటూ..
-నెనున్నానని భరోసా ఇస్తూ…..
-సమాచార శాఖలోని అవినీతి అధికారులకు
బుట్టల్లో పండ్లు ఇస్తూ…
-పనికిమాలిన పనులకు పయనమై..
-ఏలూరు టూ విజయవాడ,గుంటూరు…
-వెల్డర్ టు నేషనల్ రిపోర్టర్ పై ప్రత్యేక కథనం
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
వృత్తి వెల్డింగ్ …ప్రవుత్తి జర్నలిజం…అడ్డదారిలో అక్రిడేషన్ కార్డు … అక్రమార్జన ధ్యేయంగా …అక్రమ రేషన్ వ్యాపారస్తులకు నేనున్నా మిమ్మల్ని ఎవడ్రా ఆపేది! అని భరోసా ఇస్తూ… అక్రమ వ్యాపారస్థుల వద్ద నుండి ప్రతిఫలంగా నెలకు లక్షల రూపాయలలో సంపాదిస్తూ.. నేషనల్ రిపోర్టర్ అని సందర్భాన్ని బట్టి కులం కార్డు, జర్నలిస్ట్ కార్డు వాడుతూ… అక్రమ రైస్ వ్యాపారం కూడా చేసేది మా వాళ్లే కదా అని వారికి చూసి సపోర్ట్ చేస్తూ.. పైపెచ్చు ఇతర విలేకరులను కించపరిచేలా… అక్రిడేషన్ లిస్టు లు ఇస్తూ… సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో,కార్పొరేటర్ల కు లిస్టు ఇస్తూ…వీరు పొందింది అసలు సిసలైన అక్రిడేషన్ కార్డుఅని అది లేని వారు అసలు విలేకరులే కాదంటూ ఎవరైనా వస్తే తాను చూసుకుంటాని భరోసా ఇస్తూ… గన్నవరం విజయవాడ గుంటూరు మంగళగిరి వంటి ప్రాంతాల్లో కారులో తిరుగుతూ ఈ అక్రమ రైస్ వ్యాపారస్తులకు భరోసా ఇస్తూ…అక్రమ మద్యం రవాణాలో అరెస్ట్ కూడా అయినట్లు సమాచారం ఉన్నా…అవి కప్పిపుచ్చుకునేందుకే ఊరు దాటి …ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ…ఏలుబడి సాగిస్తున్న యర్నలిస్ట్ పై యదార్ధ విషయాలు వెల్లడి చేయనుంది ప్రజాభూమి.
అక్రమ అక్రిడేషన్ ఇచ్చిన ,తీసుకున్న నకీలీల భాగోతం అన్నీ త్వరలోనే….