Saturday, February 21, 2026

Creating liberating content

తాజా వార్తలునేపాల్‌లో కుప్ప‌కూలిన విమానం… 19 మంది మృతి..!

నేపాల్‌లో కుప్ప‌కూలిన విమానం… 19 మంది మృతి..!

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌లోని త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌ అవుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ విమానం కుప్పకూలింది. టేకాఫ్‌ సమయంలో రన్‌వేపై నుంచి జారిపోవడంతో మంటలు అంటుకుని విమానం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న సిబ్బందితో సహా 19 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం.హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ టీమ్స్ సహయక చర్యలు చేపట్టాయి. దగ్ధమైన విమాన శకలాల నుండి సహాయక సిబ్బంది ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన విమానం శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందినదిగా అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలం వద్ద సహయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article