అది గృహపీడలకు మంచిది
ఇక్కడ ఇళ్లుకట్టాలంటే మారుతీ అనుగ్రహము ఉండాల్సిందే…
ఇంటిలో పూజలు చేస్తే చైతన్యం వస్తుంది ..
ఇక్కడ మొదట చైతన్యం తెచ్చుకుంటేనే ఇళ్ళు పూర్తవుతుంది…
అక్కడ కోటికడితే లాభాలు వస్తాయి..ఇక్కడ కాసులిస్తే.. కోటిలాభాలు
లేదంటే కాటువేయడం ఖాయం…
ఇక్కడ ముడుపులు చెల్లిస్తేనే..లేదంటే మరోపిల్లర్ పడదు ..
మేయర్ తెలుసంటావో చస్తావ్ అంతే….
ఇక్కడ ప్రసాదం ఇస్తేనే…వారికి ఆ ప్రసాదం అనుకూలిస్తుంది…
ఇల్లూకట్టాలంటే కప్పం చెల్లించాల్సిందే…
కాయలమ్ము,కిడ్నీలు అమ్ము కాసులిస్తేనే కట్టడాలు…
ఇదే బెహవాడ కార్పొరేషన్లో పశ్చిమ ప్రాంత తీరు…
ఇంకెన్నాల్లో ఈ అరాచకం…
విజయవాడ:
బెజవాడ కార్పొరేషన్ రాష్ట్రంలో రెండవది. సహజంగానే అభివృద్ధిలో ముందుకుపోతుంది.పారిశ్రామకంగా లేకపోయిన సాధారణంగా అభివృద్ధి చెందుతుంది.అయితే ఈ అభివృద్ధి లో భాగంగా పెద్ద పెద్ద భవంతుల నుంచి అపార్ట్ మెంట్ల నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి.సాధారణంగా నిర్మాణానికి అనుమతులు కార్పొరేషన్,రూరల్ పరిధిలో పంచాయితీ సీఆర్డీఏ అనుమతులు తీసుకుంటారు. అయితే ఇక్కడే చిదంబరం రహస్యము దాగి ఉన్నది.
బెజవాడ కార్పొరేషన్ లో 64 డివిజన్లు తూర్పు, మద్య, పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి.అయితే పశ్చిమ పరిధిలోకి వెళ్తే అక్కడ ఆచ్చర్యక సంఘటనలు జరుగుతున్నాయి.ఇల్లు నిర్మించుకోవాలంటే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పడం లేదంట.సాధారణంగా ఇళ్లు కట్టే ముందు ఎలాంటి దిష్టి తగలకుండా అంజనేయుడి ప్రతిమ పెట్టుకొంటారు.అయితే పశ్చిమ పరిధిలో ఈయన అనుగ్రహము ఉంటేనే అది అక్రమైన,సక్రమైన ఎలాంటి ఇబ్బందులు ఉండవట. అదే విదంగా ఇల్లు కట్టాలంటే మనిషిలో చైతన్యముండాలి.ఇక్కడ ఇల్లు నిర్మించే వారికి చైతన్యం ఉంటేనే సరిపోదు ఆఇంటి చైతన్యం సంపాదిస్తేనే ఇల్లు చైతన్యవంతంగా పూర్తి అవుతుంది. ఇంకొక వార్డులో ఎన్ని కోట్లు పెట్టినా సరే కట్టడాలు జరగవు.కానీ ఆకోట్లకు లెక్కలు చూపిస్తే ఎలాంటి కట్టడమైన కట్టుకోవచ్చు.ఇవన్నీ జరిగిన తరువాత అక్కడి ప్రసాదాన్ని పొందితే ఇక ఎలాంటి కట్టడమైన ప్రశాంతంగా కట్టుకోవచ్చు.ఈ నియమాలను పాటించకుండా నాకు మేయర్ తెలుసు, వారు తెలుసు, వీరు తెలుసు నేనెందుకు వీరందరికి మొక్కలు చెల్లించాలనుకుంటే కట్టడాలు ఎలా కూలిపోతాయో అర్థం కాదు.
ఇలాంటి సంఘటనలు ఆ ప్రాంతాల్లో చోటుచేసుకోవడం అందరికి తెలిసిందే.ఈ రాజకీయ మేధావులు కేవలం వైసీపీ ప్రభంజనంలో అక్కడ ఉన్న కుల సమీకరణాలలో భాగంగా ఈ రోజు పదవులు పొందారన్నది జగమెరిగిన సత్యం. అయితే ముఖ్యమంత్రి తీరుతో దీపముండగానే ఇల్లు చక్కజేసుకోవాలన్న పాత నానుడుని బాగా వంట బట్టించుకున్నట్లున్నారు.అందుకే కట్టడాలకు వారికి కప్పం కట్టకపోతే ఆ కట్టడాలు ఎప్పుడూ ఎలా కూలిపోతాయో వారికే అర్థం కాని పరిస్థితి. ఇందులో ముఖ్యమంత్రి తప్పిదం లేక పోలేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఒకసారి సీటు ఇస్తే మళ్లీ సీటు దక్కుతుందనే నమ్మకం కల్పించక పోవడమే ఆయనచేస్తున్న తప్పిదం కాబోలు.అందుకే ఓ ప్రభుత్వ ఉద్యోగి కప్పం చెల్లించుకోలేక ఆత్మాహత్యయత్నం చేసుకున్న పరిస్థితి నెలకొన్నట్లు అక్కడ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకొక నాయకుడు అయితే ఏ నిర్మాణం అయిన నాదే నేను ఇల్లుకుడా కట్టుకోకూడడా అని బిల్డప్ ఇవ్వడముతో పాటు ఆయన మాటవినని,అయన గీసిన గీత దాటిన పత్రికలపై కూడా ఏకంగా కౌన్సిల్ తీర్మానం చేస్తే పోతుందన్న స్థాయికి వెళ్లారంటే ఇక అక్కడ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వీరందరికీ అండగా అక్కడ ఎమ్మెల్యే మాజీమంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నాయనే చెబుతారు అక్కడి ప్రజలు. అయితే ఆయన అక్కడ పోటీలో లేరన్న విషయం తెలియగానే,ఇక్కడ అభ్యర్థి కొంత ధన సహాయం చేయమని కోరడం జరిగిందని అందుకే కూటమి అభ్యర్థికి కూడా జై కొట్టారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇలాంటి తరుణంలో ఇక్కడి నిర్మాణదారులు వీరి తాకిడికి గగ్గోలు పెడుతున్నారు. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఈ అవినీతి అధికారుల భరతం ఎవరు పడతారో చూడాలి.

