తెలంగాణలో భారీ వర్షాలు కారణంగా వచ్చిన వరదలతో ముంపు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు పలు రంగాల ప్రముఖులు ముందుకు వచ్చి, ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కూడా తమ పాత్రను పోషిస్తూ, తమ ఒక రోజు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందజేశారు.పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు మొత్తం రూ. 11,06,83,571 విలువైన చెక్కును అందించారు. ఈ కార్యక్రమం తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం జరిగిన ఎస్సై పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా జరిగింది. తెలంగాణ పోలీసుల తరఫున డీజీపీ జితేందర్ చెక్కును సీఎం రేవంత్ రెడ్డి చేతికి అందించడం జరిగింది.