Friday, September 12, 2025

Creating liberating content

టాప్ న్యూస్చంద్రబాబు ప్రమాణానికి వీల్ చెయిర్ లో వచ్చిన పులివర్తి నాని

చంద్రబాబు ప్రమాణానికి వీల్ చెయిర్ లో వచ్చిన పులివర్తి నాని

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతల దాడిలో టీడీపీ నాయకుడు పులివర్తి నాని గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయాల నుంచి నాని ఇంకా కోలుకోలేదు. అయితే, తాజాగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి పులివర్తి నాని హాజరయ్యారు. కాలికి పట్టీతో వీల్ చెయిర్ లో వచ్చారు. కేసరపల్లి సభావేదిక వద్దకు పులివర్తి నాని వీల్ చెయిర్ లో వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నాని స్ట్రాంగ్ రూమ్ ల పరిశీలనకు వెళ్లారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ ను పరిశీలించి తిరిగి వస్తుండగా.. వైసీపీ శ్రేణులు నానిపై దాడికి దిగాయి. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది. దాడిని నిరసిస్తూ తెదేపా నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article