చిన్నగొట్టిగల్లుమండలం నకుచెందిన టిడిపి శ్రేణులు వైకాపాలో చేరిక..!
- సీఎం జగన్ పాలన, ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆత్మీయతకు ఆకర్షితులమయ్యాం
- పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్
చంద్రగిరి:చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి టీడీపీ శ్రేణుల వలసలు వెల్లువెత్తాయి. చిన్నగొట్టిగల్లు మండలం చట్టేవారి పాలెంకు చెందిన 8 కుటుంబాల సభ్యులు వైఎస్ఆర్సీపీలో చేరారు. గురువారం తుమ్మలగుంటలోని ఎమ్మెల్యే నివాసం వద్ద తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారికి పార్టీ కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ పాలన, ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆత్మీయతకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం, ప్రతి పల్లె ప్రగతి పథంలోపయనిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకునేప్రభుత్వం వెంటనటించేందుకు సిద్దంగా ఉన్నామంటూ తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డినిగెలిపించుకుంటామని తెలియజేశారు.
టిడిపి నుంచి వైఎస్ఆర్సీపీ లో చేరిన వారిలో చంద్ర శేఖర్, ప్రసాద్ రెడ్డీ, పొట్టిగానితోపు గ్రామంలో పొదిలి ముని కుమార్, బత్తల ప్రవీణ్, పొదిలి కృష్ణయ్య, శోభన్ బాబు, బత్తల చెంగల్రాయులు, పొదిలి లోకనాథం, పొదిలి రాజయ్య, శంకరయ్య, గిరి బాబు,బోయినిచంద్రబాబు, డేగజిచ్చు చెంగయ్య తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేంద్ర రెడ్డి, రవీంద్ర నాథ్ రెడ్డీ, రవీంద్ర నాథ్ రెడ్డీ, పొదిలి సుబ్రహ్మణ్యం, రాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
