Saturday, February 21, 2026

Creating liberating content

తాజా వార్తలుపార్లమెంట్ కీలక కమిటీల్లో టీడీపీ ఎంపీలకు చోటు

పార్లమెంట్ కీలక కమిటీల్లో టీడీపీ ఎంపీలకు చోటు

మాగుంట, వేమిరెడ్డి, లక్ష్మీనారాయణ, పార్ధసారధి, కృష్ణప్రసాద్ లకు పార్లమెంట్ కమిటీల్లో స్థానం

ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరడంతో ఆ పార్టీ నేతలకు కేంద్రంలో ప్రాముఖ్యత పెరిగినట్లుగా కనబడుతోంది. ఇప్పటికే ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉండగా, తాజాగా, ఐదుగురు టీడీపీ ఎంపీలకు పార్లమెంట్ కు చెందిన వివిధ కీలక కమిటీల్లో చోటు దక్కింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, అంచనాల కమిటీలో పార్ధసారధి, ఓబీసీ కమిటీలో జి.లక్ష్మీనారాయణ, ఎస్సీ, ఎస్టీ కమిటీలో కృష్ణప్రసాద్ స్థానం దక్కించుకున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి హౌసింగ్ కమిటీలోనూ సభ్యుడుగా ఉన్నారు. అలాగే టీడీపీకి ఒక మంత్రిత్వ శాఖ స్థాయూ సంఘం చైర్మన్ పదవి కూడా లభించే అవకాశం ఉందని టాక్ నడుస్తొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article