ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరీ దృష్టి జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలపై ఉంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, కూటమి పార్టీలు తమ విజయం పట్ల ధీమాగా ఉన్నాయి. ఎవరికి వారే తమదే విజయం అంటూ ప్రకటనలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేత బొండా ఉమ తాజాగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈసారి తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని చెబుతున్న సీఎం జగన్.. ఒకవేళ కూటమి గెలిస్తే వైసీపీని మూసేస్తానని కూడా ప్రకటించాలని సవాల్ చేశారు. పరాజయం తప్పదనే భయం ఆ పార్టీ కీలక నేతలైన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి ముఖాలలో స్పష్టం కనిపిస్తోందని బొండా ఉమ చురకలంటించారు. ఇక వైసీపీ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తప్పితే ఇంకెవరూ బాగుపడలేదని ధ్వజమెత్తారు.