వేలంపాట చాపాడు మండలం జి రామకృష్ణ దక్కింది
ఒంటిమిట్ట:సిద్ధవటం మండలం వంతాటి పల్లె గ్రామపంచాయతీ లంకమల్ల అడవుల్లో వెలిసిన శ్రీ నిత్యపూజేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసం విడిదినాల్లో తలనీలాల వేలంపాట మంగళవారం రంగనాథ స్వామి ఆలయంలో వేలం పాట జరిగింది చాపాడు మండలం పల్లవోలు గ్రామాలు చెందిన జి రామకృష్ణ,2,35,000 / వేల రూపాయలకు హెచ్చుదారుడుగా పాటను దక్కించుకున్నాడు ఈ సందర్భంగా ఎండోమెంట్ ఈవో మోహన్ రెడ్డి మాట్లాడుతూ వేలంపాటలో 11 మంది పాల్గొనగా5 మంది సభ్యులు డిపాజిట్ కట్టారని హెచ్చు దారునిగా తలనీలాలు వేలం పాట జి రామకృష్ణ దక్కించుకున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ రాజంపేట ఇన్స్పెక్టర్ జనార్ధన్, జ్యోతి వెంకటసుబ్బారెడ్డి వంతాటి పల్లె గ్రామ ప్రజలు ఆలయ సిబ్బంది చంద్ర తదితరులు పాల్గొన్నారు.