Akhil -Sreekanth Odela Latest Movie News Archives - Praja Bhoomi https://www.prajabhoomi.com/tag/akhil-sreekanth-odela-latest-movie-news/ Get the Facts, Get Prajabhoomi Tue, 23 May 2023 11:17:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 ఫుల్ ఫోకస్ మీద ఉన్నఅక్కినేని అఖిల్ .. నెక్స్ట్ సినిమాల కధల విషయంలో జాగ్రత్త చూపిస్తున్న అఖిల్ https://www.prajabhoomi.com/%e0%b0%ab%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ab%e0%b1%8b%e0%b0%95%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%80%e0%b0%a6-%e0%b0%89%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf/ https://www.prajabhoomi.com/%e0%b0%ab%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ab%e0%b1%8b%e0%b0%95%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%80%e0%b0%a6-%e0%b0%89%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf/#respond Tue, 23 May 2023 11:15:34 +0000 https://www.prajabhoomi.com/?p=1096 అక్కినేని అఖిల్ – స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ మూవీ ఏజెంట్ .. భారీ బడ్జెట్ , భారీ కాస్టింగ్ , హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ అందుకుంది .ఇక ఈ సినిమా కోసం హీరో అఖిల్ చాలా కష్టపడ్డాడు ,అయినా ఫలితం దక్కలేదు ..ఈ సినిమా రిజల్ట్ చుసిన అఖిల్ చాలా డిప్రెషన్ కి వెళ్ళాడు , ,ప్రస్తుతం […]

The post ఫుల్ ఫోకస్ మీద ఉన్నఅక్కినేని అఖిల్ .. నెక్స్ట్ సినిమాల కధల విషయంలో జాగ్రత్త చూపిస్తున్న అఖిల్ appeared first on Praja Bhoomi.

]]>
అక్కినేని అఖిల్ – స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ మూవీ ఏజెంట్ .. భారీ బడ్జెట్ , భారీ కాస్టింగ్ , హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ అందుకుంది .ఇక ఈ సినిమా కోసం హీరో అఖిల్ చాలా కష్టపడ్డాడు ,అయినా ఫలితం దక్కలేదు ..ఈ సినిమా రిజల్ట్ చుసిన అఖిల్ చాలా డిప్రెషన్ కి వెళ్ళాడు , ,ప్రస్తుతం అఖిల్ కు హిట్ అవసరము ,తాను చేపోయే నెక్స్ట్ సినిమాల స్టోరీస్ విషయంలో అఖిల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు .. ఇక క్లాస్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ,అలానే ఇటీవలే దసరా లాంటి మాస్ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇద్దరు లైన్ లో వున్నారు , అయితే వీరియిద్దరి అఖిల్ ఏ డైరెక్టర్ తో సినిమా ఒకే చేయబోతున్నారు అనే విషయం తెలియాలంటే ఈ స్టోరీ చూడాలసిందే ..

అక్కినేని నాగార్జున నట వారసుడు అఖిల్ కమర్షియల్ హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఏజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి అఖిల్ వర్క్ చేశాడు. అతను ఏజెంట్ కోసం ఎంత కష్టపడ్డాడో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. అయితే సురేందర్ రెడ్డి మాత్రం అఖిల్ కష్టాన్ని వృధా చేశారు.సరైన ఎగ్జిక్యూషన్ లేకోవడం ఏజెంట్ డిజాస్టర్ అయ్యింది. అఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా మారిపోయింది. ఈ సినిమా దెబ్బకి భాగా డిస్టర్బ్ అయిన అఖిల్ కొద్ది రోజులు ఫారిన్ టూర్ వెళ్లి రిలాక్స్ అయ్యి వచ్చాడు. ఇక ఏజెంట్ మూడ్ నుంచి బయటకొచ్చి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి పెడుతున్నాడు.అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అఖిల్ కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ లో ఒక భారీ పాన్ ఇండియా మూవీకి ఏజెంట్ షూటింగ్ టైమ్ లోనే అఖిల్ కమిట్ అయ్యాడు. అయితే ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత మరలా భారీ బడ్జెట్ మూవీ అంటే రిస్క్ తో కూడుకున్నది. దీనిపై అఖిల్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఇక మరో వైపు అఖిల్ తో సినిమాలు చేయడం కోసం ఇద్దరు దర్శకులు రెడీగా ఉన్నారు. వారిలో వంశీ పైడిపల్లి ఒకరు. ఈ ఏడాది వారసుడు సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి అఖిల్ కోసం మంచి కథ సిద్ధం చేసారు . మరో వైపు దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈ దర్శకుడు ఒక కల్ట్ కంటెంట్ ని అఖిల్ కోసం రెడీ చేసారు .యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కావడం ఇప్పటికే దసరాతో వంద కోట్ల ప్రాజెక్ట్ చేయడంతో అఖిల్ కి శ్రీకాంత్ తో మూవీ చేయాలని ఉందనే మాట వినిపిస్తోంది. అలాగే వంశీ పైడిపల్లి కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గానే ఉన్నారు. అయితే ఇప్పుడు అఖిల్ దగ్గర క్లాస్, మాస్ అంటూ రెండు ఛాయస్ లు ఉన్నాయి. మరో వైపు ఫిక్షనల్ ఫాంటసీ మూవీ కథ రెడీగా ఉంది. వీటిలో దేనిని సెలక్ట్ చేసుకొని నెక్స్ట్ సెట్స్ పైకి వెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే అఖిల్ మాత్రం ఈ సారి రొటీన్ గా కాకుండా బలమైన కంటెంట్ తో కొత్తగా ట్రై చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది .. ఇక ఏది ఏమైనప్పట్టికి ..ప్రస్తుతం అఖిల్ చేతిలో వరుసగా 3 సినిమాలు లైన అప్ లో ఉన్నాయి ..అయితే ఈ 3 సినిమాలో ఏ సినిమా సెట్స్ మీదకు తీసుకొని రాబోతున్నారు అనే విషయం తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంతవరకు ఎదురుచూడాలసిందే …

The post ఫుల్ ఫోకస్ మీద ఉన్నఅక్కినేని అఖిల్ .. నెక్స్ట్ సినిమాల కధల విషయంలో జాగ్రత్త చూపిస్తున్న అఖిల్ appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/%e0%b0%ab%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ab%e0%b1%8b%e0%b0%95%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%80%e0%b0%a6-%e0%b0%89%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf/feed/ 0