Monday, February 16, 2026

Creating liberating content

సినిమాక‌ల్కి'లోని కాంప్లెక్స్ సాంగ్ విడుద‌ల‌!

క‌ల్కి’లోని కాంప్లెక్స్ సాంగ్ విడుద‌ల‌!

ఈ గురువారం (27న‌) విడుద‌లైన ‘క‌ల్కి 2898 ఏడీ’ మూవీ సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో ఈ మూవీలో ప్ర‌భాస్, దిశా ప‌టానీ ‘కాంప్లెక్స్’లో చిందులేసిన ‘ట ట‌క్క‌ర’ వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇక ఈ పాట‌లో లొకేష‌న్స్‌, డార్లింగ్ ప్రభాస్ వేసిన సింపుల్ స్టెప్స్ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తున్నాయి. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా న‌టి ఫ‌రియా అబ్దుల్లా, డైరెక్ట‌ర్ అనుదీప్ నిలిచారు. సినిమా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. మొద‌టి రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 191.5 కోట్లు రాబ‌ట్టగా, రెండో రోజు రూ. 107 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు వైజ‌యంతీ మూవీస్ ప్ర‌క‌టించింది. దీంతో రెండు రోజుల్లో మొత్తం రూ. 298.5 కోట్లు సాధించింది. శ‌ని, ఆదివారం వీకెండ్స్ కావ‌డంతో వ‌సూళ్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉందని సినీవ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో మ‌రో రెండు రోజుల్లో ఈ చిత్రం వసూళ్లు సులువుగా రూ. 550 కోట్లు దాటేస్తాయ‌నే టాక్ న‌డుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article