విఆర్. పురం.
మండల పరిధిలోని వడ్డీగూడెం గ్రామం వద్ద, శబరీ గోదావరి సంగమ తీరాన వెలసియున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈనెల 23వ తారీకు గురువారం రోజున శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణాన్ని ఆలయం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ వారు, అప్పటినుంచి నేడు సోమవారం వరకు ఐదు రోజులు పాటు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు అభిషేకాలు భజన పాటలు తదితర కార్యక్రమాలను నిర్వహించి, అనంతరం ఈ ఐదవ రోజు వసంతోత్సవ కార్యక్రమాన్ని భక్తుల అర్షద్వనాల మధ్య నిర్వహించి, అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలో పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రామారావు, బొర్రా దుర్గాప్రసాద్, వెనకనగిరి హరినాథ్, పెట్ట హరినాథ్, సుబ్బలక్ష్మి, వరలక్ష్మి, కామేశ్వరి, బొర్రా శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

