Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుఆంధ్రప్రదేశ్ లో వైద్యశాఖకు సుస్తీ : సోమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో వైద్యశాఖకు సుస్తీ : సోమిరెడ్డి

ఏపీలో వైద్యాశాఖకు సుస్తీ చేసిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వైద్యశాఖ మాత్రమే కాదు రాష్ట్రంలో అన్ని శాఖలు పడకేశాయని విమర్శించారు. వైసీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ.. వారి లాగా తాను అవినీతికి పాల్పడలేదని సోమిరెడ్డి చెప్పారు. తనపై చేస్తున్న ఆరోపణలకు నెల్లూరులో సమాధానం చెబుతానని తెలిపారు. ఈమేరకు బుధవారం విశాఖపట్నంలో సహచర నేతలతో కలిసి సోమిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి, గంటా శ్రీనివాసరావు, రఘురామకృష్ణరాజు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం కూటమినే వరిస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయని గంటా శ్రీనివాసరావు చెప్పారు. మెజారిటీ సీట్లను గెలుచుకుని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని తెలిపారు. టీడీపీకి చెందిన మరో నేత రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. ఈవీఎం ధ్వంసంపై పిన్నెల్లిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జూన్ 4 తర్వాత వైసీపీ పని అయిపోతుందని జోస్యం చెప్పారు. వైసీపీ దారుణ పరాజయం మూటగట్టుకోనుందని చెప్పారు. సీఎస్ ను మారిస్తే రాష్ట్రంలో అన్నీ సర్దుకుంటాయని రఘురామకృష్ణరాజు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article