పోరుమామిళ్ల:
పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శుక్రవారం రథసప్తమి సందర్భంగా శ్రీ సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసులు భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు కిషోర్ శర్మ, ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాలతో శ్రీ వేంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ తులసి సురేష్ బాబు, సెక్రటరీ జనార్దన్ శ్రేష్టి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారిని సూర్య ప్రభ వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహించారు.

అనంతరం స్వామివారికి అభిషేకం అర్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం గరుడ వాహన సేవపై స్వామివారు సాయంత్రం ప్రత్యేక హోమాలు నిర్వహించారు రాత్రి చంద్ర ప్రభ వాహన సేవ పై స్వామివారి దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామసభలో దీపాలు పట్టుకొని పురవీధుల గుండా ఊరేగింపుగా తరలివెళ్లి దేవాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకగానే పట్టణంలోని పురవీధులు గోవింద నామ స్మరణతో మార్మోగాయి సూర్యప్రభ వాహనంపై ఉండే దేవదేవుని ప్రత్యక్ష చూసిన భక్తకోటికి శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయని ఆలయ అర్చకులు తెలియజేశారు. పూజా అనంతరం భక్తాతులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
