బీసివై పార్టీ ఇంచార్జి శ్రీనివాస్ రామచంద్రపురంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారభించిన శ్రీనివాస్.

రామచంద్రపురం:సాంప్రదాయ ప్రాంతీయ పార్టీలకు బిన్నంగా ముందుకు కొనసాగుతున్న బీసివై పార్టీకి నియోజకవర్గ ప్రజలు మద్దత్తు ఇవ్వాలని ఆపార్టీ ఇంచార్జి బర్ల శ్రీనివాస్ యాదవ్ కోరారు.ఈమేరకు శుక్రవారం రామచంద్రపురం పట్టణంలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) కార్యాలయాన్ని ఆపార్టీ నియోజకవర్గ ఇంచార్జి బర్ల శ్రీ నివాస్ యాదవ్ ప్రారంభించారు.రామచంద్రపురంలో పట్టణ ప్రధాన రహదారికి చేరువలో ఉన్న జాన్ విక్టర్ నందా చర్చి కాంపౌండ్ కి సమీపంలో కార్యాలయం అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నియోజకవర్గంలోని ప్రజలందరికీ తాను అందుబాటులో ఉండే విధంగా రామచంద్రపురం పట్టణం నడిబొడ్డులో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అందుబాటులో ఉండేలా చేయడం జరిగిందని అన్నారు. తన అనుచరుగణం, బంధుమిత్ర సపరివారంతో కలసి ఈ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తమ పార్టీ కార్యాలయాన్ని సందర్శించేందుకు పార్టీ కార్యకర్తలతో పాటు నియోజకవర్గ పురజనులు అందరూ ఆహ్వానితులేనని ఆయన అన్నారు. కావున పట్టణవాసులు తమ భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయానికి విచ్చేసి ఎల్లవేళలా ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చనిశ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అలాగే గత 40 రోజులుగా బీసీవై పార్టీ 2 ప్రచార ఆటోలను ప్రతి దినం రామచంద్రపురం నియోజకవర్గంలోని వివిధ పల్లె ప్రాంతాలకు పంపించి ఎన్నికల ప్రచారం జరిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. సాంప్రదాయ ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా ముందుకు సాగుతున్న బీసీవై పార్టీ యువజన నాయకత్వానికి ఓటర్లంతా మద్దతు పలికి నిస్వార్ధమైన అభివృద్ధితో కూడిన పాలన కోసం మన ఎన్నికల గుర్తైన “చెరుకు రైతు” కు తమ అమూల్య మైన ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించారు.