- సీఐ చాంద్ బాషా
వేంపల్లె
ఎవరైనా చట్టవిరుధ్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వేంపల్లె సీఐ చాంద్ బాషా హెచ్చరించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌసల్, పులివెందుల డిఎస్పీ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక రాజీవ్ నగర్ కాలనీలో ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో ప్రతి ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలపై ఆరాతీసారు. అలాగే వాహనాలు తనిఖీ చేశారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల బధ్రతే పోలీసుల లక్ష్యమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.