Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలు28వ శివరాత్రి కళ్యాణ మహోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

28వ శివరాత్రి కళ్యాణ మహోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

టి.నరసాపురం:

శ్రీ అన్నపూర్ణ విశాలక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రం టీ నర్సాపురం గ్రామంలో 28వ శివరాత్రి కళ్యాణ మహోత్సవ కరపత్రాలను. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో చైర్మన్ కమ్మీల రమేష్ రాజు అధ్యక్షతన.శివ భక్తులు.సామంతపూడి బాల సూర్యనారాయణ రాజు,దేవరపల్లి ముత్తయ్య,
టి నరసాపురం సర్పంచ్ సునంద,తాసిల్దార్.సుభాష్ విద్యుత్ అధికారిదాసరి శ్రీనివాస్,వైద్య అధికారిని జె.కల్పన రాణి,పోలీస్ సిబ్బంది.సూర్యనారాయణ రాజు,హెడ్ కానిస్టేబుల్ రాజు,ల చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూగత 27 సంవత్సరాలుగా భక్తులందరూ సహకారంతో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడంతోపాటు అఖండ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని. అందులోనే భాగంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీన ధ్వజ స్తంభపున ప్రతిష్ట కార్యక్రమం కూడా ఉన్నదని ప్రతిష్ట కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారనివచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ సభ్యులుఅన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వివరించారు.ఈ సంవత్సరం 28వ శివరాత్రి కళ్యాణ మహోత్సవాలు ఐదు రోజులు పాటు నిర్వహిస్తున్నామని మార్చ్ ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు ఐదు రోజులపాటు ఉత్సవాలు భక్తులు సహకారంతో నిర్వహిస్తున్నట్లు వివరించారు.కరపత్రాల ఆవిష్కరణకు విచ్చేసిన అధికారులకు ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ రాజు దుశ్యాలువాతో సత్కరించారు. వచ్చిన భక్తులకు రంగనాథ్ శర్మ వినయ్ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పర్వత నేనీ మురళి పసుమర్తి రాము గ్రంథాలయ కమిటీ చైర్మన్ నెల్లూరు శ్రీనివాస్,ధర్మకర్తల మండలి నెంబర్ వెజ్జు బాలరాజు, అద్దంకిరామకృష్ణ,మహేశ్వరరావు, పెద్దిన సత్యనారాయణ, అనుమాలు రామ్మోహన రావు లింగారెడ్డి శ్రీనివాస్, ఆత్కూరి శివసత్యనారాయణ,ముళ్ళపూడిసుబ్బారావు,బచ్చుసూర్యనారాయణ,తో పాటు భక్తులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article