-మీ ఆంక్షలు…ఆకాంక్షలు చూస్తే
అశ్చర్యం వేస్తోంది..
-ప్రజాధనం పంచడానికి అడ్డంకులు లేవు..
-పనికి వచ్చి రాని కార్డులకు ఎన్ని ఇబ్బందులో కదా..
-యాడ్స్ ఇవ్వడానికి ఏ అటెండెన్స్ అక్కర్లేదు..
-అక్రిడేషన్ కార్డుకు అమ్మో ఎన్ని
ఆంక్షలున్నాయోగా..
-మీరిచ్చే సమాచారం సభ్య సమాజం హర్షిస్తుందా…
-ఒకరిద్దరి కసాయి తనం కోసం ఇన్ని తప్పులు చేస్తారా..
-పురాణాలు ఇతి హాసాలు ఇప్పుడే మయ్యాయో..
-బుక్ చిరిగిన చరిత్ర ఉంటుందంటే ఇదేనా..
-ఓ దయామయా ఏమిటీ భావ దరిద్రం..
-అయ్యా సారధి గారు ఓ సారి చూడరా ఈ ఘోరాలు..
-సంఘాలు కొట్టుకు చస్తుంటే వారి సంచులు నింపుతారా..
-నీది తెలంగాణ నాది ఆంధ్ర అంటుంటే మీకు అక్కర్లేదా..
-కోర్టులకెక్కి కొట్టుకు చస్తుంటే మీకు కానరాలేదా..
-ఈ మీ నిబంధనలకు అన్నీ
సరిపోయినట్లేనా…
-కార్డుల గడువు పెంపుకు గంపెడు ఆంక్షలుంటే..
-కాసుల ఖర్చుకు కానరాలేదా కరెక్ట్ నిర్ణయాలు..
-మచ్చలేని చంద్రుడికి మరక
అంటిస్తున్నారు గా..
-ముఖ్యమంత్రి పై ఇన్ని కుట్రలు అవసరమా..
-ఇది ప్రభుత్వాన్ని ఆస్థిరపరచడమే కాదంటారా..
-కాసులిచ్చేందుకు ఉన్న తొందర.. కార్డుల జారీలో లేకపోయేనే..
-ఐఎఎస్ లను కుడా అభాసుపాలు చేయడం కాదంటారా..
-నాడు కస్తూరి చేసిన తప్పేంటీ..
-నేడు మీరు చేస్తున్న ఓప్పేంటీ..
-కూటమి ప్రభుత్వానికి కాలం కలిసి రాదా..
-అధికారులారా ఆలోచించండయ్యా…… అన్యాయం వద్దండయ్యా..
-ఏమిటీ ఈ దారుణం.. ఎందుకింత దురాలోచన…
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
“బలవంతుడ, నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా? బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ’ అంటూ… ఏనాడో సుమతీ శతకకారుడు తన పద్యంలో చెప్పింది నిజమేనని అర్థమవుతోంది ఇక్కడ ఈ అధికారులు తీరు చూస్తే…ఒక అడవిలో చలిచీమల పుట్ట ఒకటి ఉండేది. చలిచీమలంటే, గండు చీమలు కావు. కుట్టకుండా ఊరికే మన ఒంటిమీద గబగబా పాకుతాయే, అలాంటి చీమలన్నమాట. వర్షం పడేముందు అవి గుంపులు గుంపులుగా బయలుదేరి ఒక చోటునుండి ఒక చోటికి మారిపోతుంటాయి కాబట్టే, వాటిని “చలి చీమలు” అంటుంటారు.అలాంటి చలిచీమల పుట్ట అడవిలో ఓ చెట్టు నీడన ఉండేది. వర్షం భయం అసలే లేని ఆ చెట్టు నీడలో చాలా సంవత్సరాల నుంచీ జీవిస్తోన్న ఆ చీమలు, వాటికి కావాల్సిన సకల సౌకర్యాలను ఏర్పర్చుకుని సుఖంగా జీవిస్తుంటాయి. కానీ రోజులెప్పుడూ ఒకేలా ఉండవంటూ, వీటికి కూడా కష్టాలు వచ్చాయి.ఎక్కడినుండి వచ్చిందో, ఒక పాము చెట్టు తొర్రలోకి వచ్చి చేరుకున్నది. ఎప్పుడైనా వాన పడిందంటే, ఆ పాము చెట్టుదిగి వచ్చేది; చీమల పుట్టలోకి దూరేది. చీమలు సన్నగా, ఇరుకుగా ఏర్పర్చుకున్న దారులను చీల్చుకుంటూ లోపలికి దూరేది. దీంతో చీమలు ఎంతో కష్టపడి కట్టుకున్న గోడలన్నీ కూలిపోయేవి. పాము దారి ఏర్పర్చుకుని వెళ్ళే క్రమంలో చాలా చీమలు చచ్చిపోయేవి. మరికొన్ని గాయాలపాలయ్యేవి, అవి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆహారం కాస్తా మట్టిపాలయ్యేది.చీమలన్నీ కలిసి పాముకు చాలాసార్లు చెప్పిచూశాయి. తాము ఎంతోకాలం కష్టపడి, శ్రమకోర్చి కట్టుకున్న ఈ పుట్టను వదిలిపెట్టి, వేరే ఏదైనా మంచి తావును చూసుకుని వెళ్లిపోమని బ్రతిమాలాయి. మా పుట్టలోకి నువ్వు దూరినప్పుడల్లా తాము వేల సంఖ్యలో చచ్చిపోతున్నామని, తమమీద కాస్త దయచూపమని అవి వేడుకున్నాయి.అయినా పాము మనసు కొంచెం కూడా కరగలేదు, చలి చీమల బాధను అర్థం చేసుకోలేదు, వాటి గోడును పట్టించుకోలేదు. వర్షం వచ్చిన ప్రతిసారీ కావాలని పుట్టలోకే దూరేది. నవ్వుతూ, కావాలనే పుట్టలో అటూ, ఇటూ తిరుగుతూ సాధ్యమైనంత ఎక్కువ చీమల్ని చంపటం మొదలుపెట్టింది.పాము బాధను భరించలేని చీమలన్నీ ఒకరోజు సమావేశమై, ఎలాగైనా సరే ఆ పాము పీడను వదిలించుకోవాలని నిశ్చయానికొచ్చాయి. ఈసారి గనుక పాము వస్తే ఊరుకోకూడదని, కసితీరా కుట్టి చంపేయాలని గట్టిగా అనుకున్నాయి. మరికొన్ని రోజులకు వర్షం పడగానే, ఎప్పట్లాగే పాము చీమల పుట్టలోకి దూరింది.పాము పుట్టలోకి దూరగానే… అసలే కోపంగా ఉన్న చీమలన్నీ కలిసి ఒక్కసారిగా దానిమీద దాడిచేసి, దొరికిన చోటల్లా గట్టిగా కుట్టేశాయి. పాము అటూ ఇటూ కొట్టుకున్నా, విదిలించుకున్నా, దొర్లినా, ఏం చేసినా చలిచీమలు మాత్రం దాన్ని వదలిపెట్టలేదు. ఎన్ని చీమలు చనిపోయినా సరే, మిగిలిన చీమలన్నీ పామును గట్టిగా కుడుతూనే ఉన్నాయి. చివరికి తట్టుకోలేని పాము చచ్చిపోయింది. ఎట్టకేలకు చలిచీమలు ఆ విధంగా పాము పీడను వదిలించుకున్నాయి.ఈ కథలాగే ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న పత్రికలను పాము చూసిన చందాన సమాచార శాఖా అధికారులు చూస్తున్నారని చెప్పక తప్పడం లేదు.ఈ వ్యాసం కొంత అసహనం అనుకున్న అపహాస్యం అనుకున్న కసాయి లాగా కుళ్ళుకున్న ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన కూటమి ప్రభుత్వం లో అట్టడడుగున జరుగుతున్న అన్యాయం పై ఆవేదన చెందుతున్న అనేకమంది సంపాదకులకు సముచిత న్యాయం కోసం అందిస్తున్న కథనం…కాస్త ఓపిక తో చదవండి… చర్చించండి.. చంద్రబాబు నాయుడు నాయకత్వ సమర్థతపై సంపాదక వర్గం చిన్న చూపు చూడకుండా చేద్దాం… ఇంతకీ ఇక్కడ చలిచీమలు చిన్న పత్రికలు… చెట్టు అంటే ప్రభుత్వం.. పాము అంటే ప్రబుత్వం లో ఉన్న కొంతమంది అధికారులు. ఇక్కడ ప్రధానంగా ఈ సమాజంలో ఎంతో కొంత పరిజ్ఞానం కలిగి ప్రజా సంక్షేమం ఆశించి కొన్ని వేల పత్రికలు ప్రచురితం అవ్వడానికి నోచుకోలేక పిడిఎఫ్ కే పరిమితము అయ్యితే వందల సంఖ్యలో ఎంతో కొంత లక్షలు వేలు కాక పోయిన వందల సంఖ్యలో ప్రచురితమై చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కాలాన్ని వెళ్లబుచుతున్నాయి.ఇవన్నీ ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకమూ కాదు అట్లని అనుకులమూ కాదు.పరిస్థితిలు స్థానిక అంశాలపై ఆధారపడి ఆయా అంశాల ప్రాతిపదికన అలా నెట్టుకుంటూ వస్తున్నవే. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటీ చీమలు హాయిగా బ్రతకాడానికి చెట్టుకు తొర్ర వేస్తున్న పోనీలే బ్రతకమని జాలిగా అవకాశాలు ఇస్తుంది. అంటే చెట్టులాంటి ప్రభుత్వం. ప్రభుత్వం కూడా ప్రజల రక్తాన్ని చెమట గా మార్చి పన్నులు చెల్లిస్తే ఆ పన్నుల రూపంలో వచ్చిన పది రూపాయలను ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఖర్చుచేస్తుంది.ఇక్కడ ఖర్చు చేయడానికి ప్రభుత్వా సానుకూలంగా ఉంది ఆ ఖర్చులు రూపంలో తీసుకున్న రూపాయిని తిరిగి పేపర్ ప్రింటింగ్ వేసి కొంత మనుగడ సాదించడానికి పత్రికా సంపాదకులు తమ చావు తాము చస్తూంటారు.అయితే ఇక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది లేదు పత్రికలకు ఇబ్బంది లేదు కానీ ప్రబుత్వానికి పత్రికల మధ్య ఉన్న ప్రభుత్వం లో తాము కూడా భాగమే అన్న అధికార యంత్రాంగం పాములాగా వ్యవహరిస్తోందన్న తీరు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. ఎందుకు అలా అనవలసి వస్తుందంటే గత ప్రభుత్వం లో చిన్న పత్రిక లు చితికి పోయాయి.ప్రపంచాన్ని వణికించిన కరోనా కంటే నాటి కఠిన నిర్ణయాలతో కోలుకోలేని స్థితికి వెల్లిపోయాయి. ప్రశ్నిస్తే ప్రాణాలకు దిక్కులేని స్థితి, కేసులతో సంకెళ్లు వేస్తారని భయం తో తల్లడిల్లి పోయాయి. పత్రికొక్కటున్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో… ” అని చెప్పిన విదంగా రాష్ర్టంలో ఉన్న చలి చీమలాంటి చిన్న పత్రికలు అన్ని ఒకటై తమ కలాన్ని ఎంతో కొంత పదును బెట్టి కథనాలను ప్రజలకు ఆందించి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ఉడతా భక్తిగా ఉపయోగ పడ్డాయని చెప్పక తప్పలేదు. కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు నెలలు గడిచింది. ఎన్కో గండాలనుండి గట్టెక్కి నూతన సంవత్సరం లోకి అడుగు పెట్టింది కానీ చిన్న పత్రికలపై ఆంక్షల పేరుతో నాటి కంటే మరింత అట్టడడుగు స్థాయికి డిగజార్చే విదంగా అడుగులు వేస్తుంటే అయ్యో అని ఆవేదన చెందుతున్నారు. అక్రిడేషన్లలో అందరికి సమన్యాయం చేయాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే ఆ పక్రియ చేయాల్సిన అధికారులలో చిత్తశుద్ధి కొరవడి తీవ్ర అన్యాయం కు గురిచేస్తుంటే అయ్యో ఇలా అయితే ప్రభుత్వాని కి అప్రదిస్ట పాలు వస్తుందని సమాచారశాఖ మంత్రి పార్థసారధి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుక వెళ్లి కొంత వెసులుబాటు కలిగేలా చేసారని సంపాదక వర్గంలో ఉండగానే కార్డుల గదువులో ఒకరిద్దరి కసాయిల స్వార్థం తో గడువు ముగిసిన మరునాడు జీవో ఇస్తే ఆది అటు ఇటుగా ఎంత కాదన్నా కూటమి ప్రభుత్వానికి కొంత మచ్చ తెచ్చి పెట్టింది. ఇంత ఆలస్యంగా ఇవ్వడం వలన ప్రజాధనం ఏదయినా మిగిలి పోయిందా అంటే అబ్బే అదేమీ లేదంటా…ముందుగానే ఇస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందాఅంటే అబ్బేఅదేమీ లేదండి అంటూ అడ్డగోలు మాటలు.ప్రజల్లోకి వెళ్ళేది ప్రభుత్వం లో ఉన్న పెద్దలైన ముఖ్యమంత్రి మంత్రులే గా…తిరుగు బాటు కానీ సమస్య ఉత్పన్నం అయితే పరిష్కరించేది వారే కదా. ఏసీ గడులక్ కూర్చుని కసాయి లతో కలిపి కుట్రలు చేసే అధికారులు కాదుగా.ఇలా కార్డుల నిర్లక్ష్యం తో కొంతమంది అపకీర్తి కొత్త సంవత్సరంలో మూటగట్టుకుంటుంటే ప్రకటనల జారీ లో చూస్తే పక్కున నవ్వుతోంది పాటక లోకం. అక్రిడేషన్ కార్డులు కు ఉన్న ఆంక్షలు ప్రకటన ల జారిలో కంటికి కనిపించకుండ పోయాయి.మనుగడ అన్న మాటే ప్రాణానికం లేకుండా ప్రజాధనాన్ని దోచి పెట్టేందుకు సిద్ధం అయిపోయారు.జాబితా కూడా విడుదల చేసేసారు.ఈ జాబితా చూస్తే ఈ అధికార వ్యవస్థను చూసి జాలి పడాలో కింద జారీ పడిపోవాలో అర్థం కాని పరిస్థితి పత్రికా వ్యవస్థ కు రావడం పెద్ద పొరపాటో గ్రహాపాటో అనాలి. ప్రతి సంపాదకుడు నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ ముద్రణ వేసి ప్రజా క్షేత్రం లోకి విడుదల చేస్తారు. నూతన సంవత్సరం అంటే జనవరి ఒకటోవ తేదీ ప్రకటన విడుదల చేసింది డిసెంబర్31వతేది.అంటే క్యాలెండర్ ఎప్పుడు ప్రింట్ అవ్వాలి…ఎప్పుడు బైటికి రావాలి.మల్లీ జిరాక్స్ఇస్తారు…ఒక్క పేజీ ఇస్తారని పొద్దుపోనీ మాటలు ఒకటి మరి.ఈ ఆలస్యం వల్ల ఈ అధికారులు ఈ ప్రబుత్వానికి మేలు చేసి నిధులు మిగిల్చి నట్లా అంటే చచ్చి పోయిన అంటే ఢీ ఫంక్షన్ లో ఉన్న పత్రిక లకు కూడా పెద్ద పీట వేశారు. నిధులు కట్ట బెట్టడానికి అడ్డంకి ఏ నష్టం లేని అక్రిడేషన్ కార్డుల మంజూరులో ఇన్ని మతిలేని మాటలు ముప్పతిప్పలు పెట్టె మూలన ఉన్న జీవో లు తెచ్చి సంఘాల పేరుతో ముష్టి పనులు చేసే కసాయు నాయకుల కళ్ళల్లో ఆనందం చూసి వేలాది మంది గ్రామీణ జర్నలిస్టుల కళ్లలో కారం కోట్టడడమే అవుతుంది గా.. సంఘాల ముసుగులో కొట్టుకు చస్తూ కోట్లాది రూపాయల బకాయిలు డిగమింగిన వారికి కోర్టులకెక్కి కీచులాట లాడే వారికి ఈ రాష్ర్టంలో గుర్తింపు లేక ఆ నాయకుడికి నాలుగు అక్షరాలు రాకపోయినా ఓ కాగితం ఇస్తే చాలని ఉన్న ఈ అధికార వ్యవస్థ తో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాని కి మాయని మచ్చ తెచ్చి పెట్టె ప్రయత్నం జరుగుతుందనే ఆలోచన ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి చేసి ఐఏఎస్ లు.కూడా అయ్యా ఇది ఎస్ అనండి అంటూనే అలాగే అని తల ఊపితే తమకు తిప్పలు తెచ్చిపెట్టక తప్పదని సంపాదక వర్గం సూచిస్తుంది. గత ప్రభుత్వాన్ని పదే పదే ఎత్తి చూపే అధికార యంత్రాంగం నేడు చేస్తున్న తప్పిదాలు కూడా సరియైనవి అంటే నాడు కస్తూరి అనే అధికారి చేసిన పని కూడా కరెక్ట్ గా అని అంటున్నారు.అప్పుడు ఆమె ఒక్కటే పనిస్మెంట్ అనుభవించాలి ఇప్పుడు వీరు చేసేది కరెక్ట్ అయితే…ఇలా కొంతమంది అధికారుల అత్యుత్సాహం వల్ల ఎవరో ఒకరే బలికాక తప్పదని అందుకే ఆలోచించి అద్భుతమైన పాలన అందిస్తున్న అమరావతి సృష్టికర్త నవ్యాంధ్రప్రదేశ్ రూపసిల్పి నారా చంద్రబాబు నాయుడు కు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు యువ ముఖ్యమంత్రి నారా లోకేష్ సౌమ్యుడు స్నేహశీలి పార్థసారధికిలకు పత్రిక ల నుంచి పెదవి విరుపు లేకుండా చూడాలని కోరుకుంటుంది పత్రికా లోకం.చలిచీమలాంటి చిన్న పత్రిక లతో మంచి చేసే మనసున్న ముఖ్యమంత్రి ని పాములాగా ఉహించు కునే ఓ చిన్న ఆలోచన కూడా రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ అధికారులకు చేతులెత్తి మొక్కుతోంది సంపాదక వర్గం..కసాయిలకు కలమే సమాధానం చెబుతుందని కలాన్ని నమ్ముకుని ఉన్న వారు కోరుకుంటున్నారు.