తెలుగు దేశం పార్టీని వీడి నాలుగు సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో సతీష్ రెడ్డి కండువా కప్పుకున్నారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, వేంపల్లి జెడ్పిటిసి రవికుమార్ రెడ్డి, కన్వీనర్ చంద్రఓబుల్ రెడ్డి, సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు పాల్గొన్నారు.