పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలారాజు.
జీలుగుమిల్లి:మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక కార్యకర్త,సీనియర్ నాయకులు రాచన్నగూడెం గ్రామానికి చెందిన కీ.శే సింగలదేవి సత్యనారాయణ మృతి బాధాకరమని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంతాపం తెలిపారు.సత్యనారాయణ వైసిపి పార్టీ బలోపేతానికి ఎంతో కృషిచేసారని,నిజాయితీగల కార్యకర్తగా పార్టీ విజయానికి ఎంతో కష్టపడ్డారని తెల్లం బాలరాజు తెలిపారు.ఆయన కుటుంబానికి వైసిపి ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి అండగా ఉండేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.ఆయన మృతికి నేను నా సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి ప్రగాఢ సానుభూతిని తెలువుతున్నామని ఆయన తెలిపారు

