పులివెందుల
ఆదివారం రాప్తాడు లో జరగబోయే సిద్దం సభకు సంబంధించిన బ్యానర్లు,పోస్టర్లను మంగళవారం మున్సిపల్ వైకాపా ఇన్చార్జ్ మనోహర్ రెడ్డి, మున్సి పల్ చైర్మన్ వరప్రసాద్, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గంగాధర్ రెడ్డి, ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులివెందుల మునిసిపాలిటీ లోని ప్రతి ఒక్క వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా తరలి వచ్చి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క వార్డుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మీ వార్డులో ఏర్పాటు చేసిన బస్సులో ఎక్కి వచ్చి రాప్తాడు లో జరిగే సిద్ధం సభను విజయవంతం చేసి సురక్షితంగా గమ్యం చేరుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జే సి ఎస్ ఇన్చార్జులు పార్నపల్లి కిషోర్, చంద్రమౌళి, కౌన్సిల ర్లు కోడి రమణ, ఖాదర్ భాష, కో ఆప్షన్ మెంబర్ దాసరి చంద్రమౌళి, అంకాలమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ ప్రసాదు, వైకాపా నాయకులు డేనియల్ బాబు,పద్మనాభరెడ్డి,రాజేష్ నాయుడు, శ్రీరాము లు ,రమేష్, ప్రశాంత్, రాజా , నగిరిగుట్ట నాగరాజు, సోపాల వీర, తదితర వైకాపా నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.