తిరుమల శ్రీవెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న రాజకీయ వివాదం కొత్త మలుపులు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో నాణ్యమైన నెయ్యి బదులుగా జంతువుల కొవ్వు వాడారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసాయి.ఈ వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండిస్తూ, పవిత్రమైన తిరుమల ఆలయాన్ని, లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడొద్దని హెచ్చరించారు.షర్మిల అభిప్రాయ ప్రకారం, ఈ ఆరోపణలు కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, తిరుమల ఆలయ ప్రతిష్ఠను అపవిత్రం చేస్తాయన్నారు. అదనంగా, ఆమె చంద్రబాబుకు సవాలు విసురుతూ, నిజంగా ఇలాంటి దురాచారాలు జరిగితే, అటువంటి వ్యక్తులను కనుక్కోవడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని, లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.షర్మిల చంద్రబాబును తన ఆరోపణలపై కట్టుబడి ఉండాలని, దీనిపై నిజానిజాలను ప్రజల ముందుకు తేవాలని కోరారు.