చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు
తూతూ మంత్రంగా దాడులు
పులివెందుల టౌన్
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల పట్టణం దుకాణాలలో, హోటల్లు, చిరు వ్యాపారులు, పండ్ల మార్కెట్లో ఎక్కడబడితే అక్కడ ప్రభుత్వ నిషేధిత ప్లాస్టిక్ కవర్లు దర్శనమి స్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించినప్పటికీ పట్టణంలో ఎక్కడ చూసినా ప్రజల చేతుల్లో ప్లాస్టిక్ కవర్లు దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి గుడ్డ సంచులు వాడాలని ప్రభుత్వాలు చెబుతు న్నప్పటికీ వ్యాపారులు ప్రభుత్వ ఆదేశాలను భేఖతార్ చేస్తూ విచ్చల విడిగా కవర్లను అమ్ముతున్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడటం వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడటం వల్ల వాతావరణం లో కాలుష్య ఏర్పడుతుంది అయినప్పటికీ ప్లాస్టిక్ కవర్ను నిషేధించే నాధుడే కరువయ్యారు. మున్సిపల్ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తారే తప్ప పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు గుసగుసలాడుతున్నారు. హోటల్లో భోజనాలు పార్సల్ కట్టించేటప్పుడు కాలుతున్న అన్నాన్నిప్లాస్టిక్ కవర్ వేసి కట్టడంతో ప్లాస్టిక్ లోనే రసాయనాలు వాటిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. మరి దారుణం ఏమిటంటే హోటళ్లలో ఇడ్లీలు ప్లాస్టిక్ కవర్ల పై వాడడంచాలా ప్రమాదకరం అని తెలిసినా కూడా హోటల్ యజమానులు ఇడ్లీ పిండిని ప్లాస్టిక్ కవర్ లోనే పెట్టి ఉడికించడంతో ప్లాస్టిక్ లోనే రసాయనాలు ఇడ్లీలోకి వెళ్లి ప్రజలు అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ మున్సిపల్ అధికారులు నామమాత్రంగానే దాడులు నిర్వహిస్తున్నారు. దాడులు నిర్వహించి పట్టుకున్న కవర్లను గుట్టు చప్పుడు కాకుండా తిరిగి వారికే వెనక్కి ఇస్తున్నారని సమాచారం. ఇలా ఇవ్వడంతో వ్యాపారులకు ఏమి భయము ఉంటుందని, అలా వెనక్కి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు.
హోటళ్లలో అన్నం పార్సల్ కట్టించుకొని ఆ పార్షల్లో ఉన్న అన్నం భోజనం తిన్న తర్వాత మిగిలిన అన్నాన్ని అలానే పారిపోవడంతో ఆ అన్నాన్ని ఆవులు ప్లాస్టిక్ కవర్ తో సహా తిని చాలా అవులు మరణించడం జరిగింది. మరికొన్ని ఆవులు తిన్న ప్లాస్టిక్ కవర్ అరుగ క ముక్కుల ద్వారా వ్యర్ధమంతా కారుతూ దుర్వాసనలు వస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు తినడం వలన వింత రోగాలు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వము నిషేధించిన కవర్లు దుకాణాలలో గోధుమపిండి, చక్కర, కంది బేడలు, బెల్లం, చింతపండు, తదితర వస్తువులను ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి వారాల తరబడి అలానే ఉంచుతున్నారు. ప్లాస్టిక్ లో ఉన్న కెమికల్స్ అందులో చేరి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం చాలా ఉంది ఓ పక్క ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధించమని అధికారులకు జీవోలో ఆదేశించినప్పటికీ అధికారులు వాటిపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ అధికారులు స్పందించి ప ట్టణములో ప్లాస్టిక్ కవర్ లేకుండా చేసి ప్లాస్టిక్ రహిత పులివెందుల గా నిలపాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందని ఇందుకు కూడా ప్రజలు స్వచ్చందంగా సహకరించాలని చెప్పుకోవచ్చు