Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుతిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క

తిరుమల: తెలంగాణ రాష్ట్ర‌ మంత్రి సీతక్క ఇవాళ‌ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు మంత్రి సీతక్కు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పని ఒత్తిడి వల్ల మొక్కులు చెల్లించుకోవడం ఆలస్యమైందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article