వేరుశనగ విత్తనాలు కూడా రైతులకు అందజేస్తాం సబ్సిడీపై
శాసనసభ్యులు బాలరాజు
జీలుగుమిల్లి:రైతులకు వేరుశనగలు విత్తనాలు కూడా సబ్సిడీ పైన అందజేస్తామని పోలవరం శాసనసభ్యులు బాలరాజు అన్నారు.
జీలుగుమిల్లి మండలం లో ఆర్బికేల ద్వారా నాణ్యమైన వరి విత్తనాలు గీరీజన రైతులకు పంపిణీ కార్యక్రమం లో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశానికి వెన్నెముక రైతు, రైతు బాగుంటే మనం బాగుంటాం, కాబట్టి రైతులకు ఎరువులు, విత్తనాలు, సకాలంలో అందేలా చెయ్యలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ మండలం లో వేరుశెనగ రైతులు ఎక్కువ ఉన్నారు వారికోసం కూడా మాట్లాడి వారికి విత్తనాలు సబ్సిడీ రూపంలో వారికి చేకూరెలా అధికారులతో మాట్లాతాం అని రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది.జీలుగుమిల్లి మండలం లో మొత్తం 2,647 ఎకరాలు వరి సాగుకు విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో జీలుగుమిల్లి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గంగాధర్ ,ఎడీపీ బుచ్చి బాబు , వీఎఎ లు కనకదుర్గ,లావణ్య రష్మీ,విద్య, మరియు ఎన్ డి ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు .
