సర్పంచి శ్రీనివాస్
కామవరపుకోట
రావికంపాడు ఉన్నత పాఠశాల యందు జరిగిన పాఠశాల మేనేజ్ మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహణలో చైర్మన్ గా శ్రీ బేతిన శ్రీను, వైస్ చైర్మన్ గా చేబ్రోలు వెంకటలక్ష్మి,ఇతర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు ప్రధానోపాధ్యాయులు భీమరాజు,స్కౌట్ మాస్టర్ బిరుదుగడ్డ నాగేశ్వరరావు నిర్వహణలో ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు సేవలు అమోఘం అని సర్పంచ్ వేముల శ్రీనివాస్ రావ్ అభినందించారు. ఎన్నికైన కమిటీ పాఠశాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. పంచాయతీ నుండి పాఠశాలకు సహాయ సహకారాలు అందించడానికి ముందుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికైన కమిటీ కు పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

