ఎంపీడీవో కె.ఆర్.ఎస్.కె ప్రసాద్
జీలుగుమిల్లి :గ్రామ పంచాయితీలు అభివృద్ధి చెందాలంటే కార్యదర్శి సర్పంచులు పరస్పర సహకారం అవసరమని ఆయన అన్నారు.
గ్రామ పంచాయతీల పైన కార్యదర్శులకు సర్పంచ్లకు అవగాహన ఉన్నట్లయితే పంచాయతీ అభివృద్ధి చెందుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె.ఆర్.ఎస్ కృష్ణ ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి డైరెక్టర్ ఆదేశాల మేరకు జీలుగుమిల్లి మండలంలోని పై నుండి పంచాయతీలకు సంబంధించి పంచాయతీ సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు ఈనెల 19 నుండి 21 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అని చెప్పారు. ఈ శిక్షణ తరగతులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మండల స్థాయిలోని అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అని చెప్పారు. గ్రామాలలో వీధిలైట్లు, పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి ప్రణాళికలు, పంచాయతీ పరిపాలన తదితర అంశాల పైన శిక్షిస్తామని ఆయన చెప్పారు. ఈ శిక్షణలో టి ఓ టి యు దేవ ప్రియుడు, డిపి ర్ సి ఎఫ్ టి సి జి నాగేశ్వరరావు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేడు 12 మంది సర్పంచులకు గాను పదిమంది సర్పంచులు హాజరైనట్లు చెప్పారు. 9 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారని మీరందరూ కూడా హాజరయ్యారని ఆయన తెలిపారు. ఈ అవగాహన వల్ల పంచాయతీలలో ఏ సమస్య వచ్చినా ఎట్లా తీసుకోవచ్చును, ఏ అధికారులను సంప్రదించాలనో శిక్షణ తరగతులు వారికి నివృత్తి చేసినట్లు చెప్పారు. తాటి ఆకులు గూడెం సర్పంచ్ వనమా పలు సూచనలను చేశారు. వారికి అర్థమయ్యే రీతిలో శిక్షణ తరగతులు నివృత్తి చేశారు.


