కదిరి:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కదిరిలో చేపట్టిన శంఖారావం సభను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జయప్రదం చేయాలని కదిరి అసెంబ్లీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ కోరారు. బుధవారం ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేటి నుండి లోకేష్ శంఖారావం సభలు ఉంటాయని, అందులో భాగంగా కదిరి పట్టణంలోని మదనపల్లి రోడ్డులోగల దేవరచెరువు సమీపాన కొత్త బైపాస్ రోడ్డు దగ్గర శంఖారావం సభ జరుగుతుందని తెలిపారు. కావున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు, కౌన్స్లర్లు, వార్డు ఇంచార్జ్లు, నాయకులు, మండల కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్లు, కుటుంబ సాధికారిక సభ్యులు, తెలుగుయువత, మహిళా విభాగం నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్, టీఎన్ఎస్ఎఫ్, టిఎన్టియుసి, టీడీపీ, తెలుగు రైతులు, బూత్ కమిటీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అన్ని అనుబంధ సంస్థ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని అభ్యర్థించారు. అదేవిధంగా కదిరి నియోజకవర్గం ఆరు మండలాల నుండి పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కాగా మంగళవారం పెనుకొండ కీయా వద్ద జరిగిన ‘రా కదిలి రా’ కార్యక్రమానికి హాజరైన కదిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కందికుంట తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు ఇర్ఫాన్, మండల కన్వీనర్లు కొండయ్య, రెడ్డి శేఖర్, తెలుగు యువత నాయకులు హరి, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.