సద్గురు జగ్గీ వాసుదేవ్ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక నిరసనలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, ఆ దేశంలోని మైనారిటీలను రక్షించడం మన బాధ్యత అని అన్నారు. బంగ్లాదేశ్‌లోని పరిస్థితులు కేవలం ఆ దేశానికి మాత్రమే పరిమితం కాదని, ఒకప్పుడు అఖండ భారతదేశం రణరంగంగా మారడం బాధాకరమని తెలిపారు.
సద్గురు ట్వీట్ చేస్తూ, “ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌కు మనం అండగా నిలవాలి. మన పొరుగున ఉన్న మైనారిటీల భద్రత కోసం మనం వీలైనంత త్వరగా స్పందించాలి. భారత్ మహా భారత్ కానాలంటే ఈ బాధ్యతను మనం ఎప్పటికీ మరిచిపోవద్దు. దురదృష్టవశాత్తూ ఈ దేశంలో భాగమైన ప్రాంతం పొరుగు ప్రాంతంగా మారింది. అయితే ఈ దిగ్భ్రాంతికరమైన దురాగతాల నుండి, వాస్తవానికి ఈ నాగరికతకు చెందిన వారిని రక్షించడం మన బాధ్యత” అని అన్నారు.
సద్గురు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు ఈ వ్యాఖ్యలను ప్రశంసిస్తూ, మైనారిటీల రక్షణకు సమర్థించారు. మరికొందరు దీనిపై విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

