జగ్గంపేట

గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ పెమ్మన బోయిన వరప్రసాద్ ఆధ్వర్యంలో నూతనంగా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీ నుండి తన స్వగ్రామం కాకినాడ విచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సతీష్ కి, మల్లేపల్లి బ్రిడ్జి దగ్గర ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేసిన సానా సతీష్ ఆప్తమిత్రుడు బంధువు పెమ్మన బోయిన వరప్రసాద్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాకు అత్యంత ఆప్తులు మా ఆత్మీయులు సతీష్ గారు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి స్వగ్రామానికి విచ్చేస్తున్న శుభ తరుణంలో వారికి ఘనంగా స్వాగతం పలికిమన్నారు. ఆయన ఎంపీ నిధులతో కాకినాడ జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, వరప్రసాద్ బంధువులు ఆత్మీయులు పాల్గొన్నారు.