లోక్‌సభ ఎన్నికలు-2024 నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ రికార్డు స్థాయిలో ఏకంగా రూ.1100 కోట్ల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సీజ్ చేసిన రూ. 390 కోట్లతో పోలిస్తే ఇది 182 శాతం అధికమని ఆదాయ పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. మే 30 నాటికి దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు, ఆభరణాల విలువ సుమారు రూ.1100 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. ఢిల్లీ, కర్ణాటకలో అత్యధిక నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో రూ.200 కోట్లు చొప్పున, తమిళనాడులో రూ. 150 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో ఉమ్మడిగా రూ. 100 కోట్ల పైచిలుకు నగదు, నగలు సీజ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.