తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాలు రాచరిక వ్యవస్థను వ్యతిరేకించి విజయం సాధించడంలో కీలకమైనవని గుర్తు చేశారు. తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం అని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నందున, తమ ప్రభుత్వం పారదర్శక పాలనను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.విమోచనం, విలీనం వంటి అంశాలపై స్వప్రయోజనాల కోసం వ్యవహరించడం సరికాదని ఆయన సూచించారు. సెప్టెంబర్ 17ను వివాదాస్పదం చేయకుండా ఐక్యతను, సమైక్యతను కాపాడాలన్నదే ముఖ్యమని చెప్పారు.సీఎం రేవంత్, రాష్ట్ర ప్రగతికి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలు మార్గదర్శకంగా ఉంటాయని, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో అనేక చర్యలను చేపడుతున్నామని పేర్కొన్నారు.˘