యువకులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వీ. ప్రజాభూమి బ్యూరో, అనంతపురము రెడ్ క్రాస్ సేవలను విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వీ. పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని పాతఊరులో పాత సిడి హాస్పిటల్ ఆవరణలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ప్లేట్లెట్ కాంపోనెంట్ సపరేటర్, 25 కిలోఓల్ట్స్ సోలార్ ప్యానెల్ లను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ కాపు భారతి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెడ్ క్రాస్ మెంబర్ కాపు రామచంద్రారెడ్డి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జనరల్ మేనేజర్ కేహెచ్ మౌనాష్, వైస్ చైర్ పర్సన్ డా.జి.లక్ష్మణ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని, ఎన్నో సేవలను ప్రజలకు అందించాలన్నారు. రెడ్ క్రాస్ తో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై ముందుకెళ్లాలన్నారు. రెడ్ క్రాస్ సొసైటీలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద రూ.30 లక్షల విలువైన ప్లేట్లెట్ కాంపోనెంట్ సపరేటర్, రూ.16 లక్షల విలువున్న 25 కిలోఓల్ట్స్ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. మెంబర్షిప్ లో రాష్ట్రస్థాయిలో ముందంజలో ఉండడంతో గవర్నర్ అవార్డు జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీని ఉత్తమ సొసైటీగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజాసేవలో రక్తం అందుబాటులో ఉంచాలని, యువకులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మెంబర్షిప్ తీసుకోవాలని, అవసరమైనప్పుడు అందుబాటులోకి వచ్చి ప్రజాసేవ చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కి రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్షిప్ కార్డును రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అపేరేసిస్ మిషన్ లాభాలను, ప్లేట్లెట్స్ ఇవ్వడం వల్ల ఉపయోగాలను, రక్త దానం చేయడం ద్వారా కలిగేటువంటి ఉపయోగాలను వివరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా రక్త దానం చేస్తూ రెడ్ క్రాస్ ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కాపు భారతి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రతి ఒక్క యువత రక్తదానం చేస్తూ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఎంతోమందికి సహాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అడిషనల్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ జెడ్ఎం హమంత్, తహసీల్దార్ హరికుమార్, రెడ్ క్రాస్ సెక్రెటరీ మోహన్ కృష్ణ, అదనపు వైద్యాధికారి డా.అనుపమ జేమ్స్, మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎన్సిసి మురళి, నీరజ, జైను బేగం, కార్తీక్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజర్స్ బ్లడ్ డోనర్స్, పవర్ గ్రిడ్ సిబ్బంది, రెడ్ క్రాస్ సిబ్బంది, యువత తదితరులు పాల్గొన్నారు.