మాస్ మహారాజ రవితేజ కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో రవితేజ కూడా ఒకరు. ఇక రవితేజ ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలేవి కూడా అంతగా అభిమానులను అందించడం లేదు. ధమాకా సినిమా తర్వాత వచ్చిన ఏ సినిమాలు కూడా మాస్ మహారాజ అభిమానులు ఊహించినంత మేర సినిమాలు హిట్ అవ్వడం లేదు.ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన ఈగల్ కూడా మొదట హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ కూడా అభిమానులను నిరాశ పరిచాయి.ఇదిలా ఉంటే తాజాగా రవితేజ మహేష్ బాబు అల్లు అర్జున్ లాగా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారట. ఒకరకంగా చెప్పాలంటే అల్లు అర్జున్, మహేష్ బాబులకు పోటీగా ఈయన మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.తాజాగా సినీ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం రవితేజ దిల్ సుఖ్ నగర్ ఏషియన్ వారితో భాగస్వామ్యం పెట్టుకుని 6 స్క్రీన్స్ ఉన్న భారీ మల్టీప్లెక్స్ ని నిర్మించబోతున్నారట.ఇక ఈ మల్టీప్లెక్స్ కి ART అనే పేరును కూడా పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు AMB,అల్లు అర్జున్ AAA అనే మల్టీప్లెక్స్ లు నడిపిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికి పోటీగా ART అనే మల్టీప్లెక్స్ కూడా త్వరలోనే గ్రాండ్ గా ఓపెన్ అవ్వబోతున్నట్టు సమాచారం