మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి మహిళల హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల విమానంలో వెళుతూ రామ్ చరణ్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన మహిళా అభిమానులు.. చెర్రీ ఆదర్శ భర్త అని, బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇచ్చేయాలని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రి వెడ్డింగ్ గ్రాండ్ గా జరుగుతోంది. ఈ వేడుకకు ఆహ్వానం అందడంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు శుక్రవారం జామ్ నగర్ బయలుదేరి వెళ్లారు. ప్రైవేట్ జెట్ లో ప్రయాణిస్తూ ఉపాసన కునుకు తీయగా.. రామ్ చరణ్ ఆమె పాదాలకు మసాజ్ చేశాడు.దీనిని రామ్ చరణ్ అసిస్టెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది.