ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు, నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఆమె వివాహం నిన్న గోవాలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు తరలి వచ్చారు.

వీరిద్దరూ గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కొత్త జంటకు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
