భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో కలిసి ఆమె ఏడు అడుగులు నడిచారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ ఈ పెళ్లి ఘట్టానికి వేదికగా నిలిచింది.