పుష్ప సినిమాలో హీరో ఆయనే అన్నది సత్యమే గా
అక్కడ చేయించేదంతా సత్యమేగా…
సినిమాలో ఎర్రచందనం ఇక్కడ రేషన్ బియ్యం సత్యమే గా
అడ్డొస్తే తొక్కేస్తాం అన్నది సత్యమేనా…కాదా
అధికార పార్టీ కి ఐదు,ప్రతి పక్షానికి మూడు లక్షలు ఇచ్చేది కూడా సత్యమేనా …కాదా…
ఆ పుష్ప అడవుల్లో అర్ధరాత్రి…ఈ పుష్ప ఎప్పుడైనా అన్నది సత్యమేనా కాదా…
పేదల బియ్యం పబ్లిక్ గా దోచుకుంటున్నది సత్యమేనా కాదా..
రెవెన్యూ, పోలీస్ ,విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ గులాములన్నది సత్యమా..కాదా…
ప్రజాభూమి, pbtv కి కూడా ప్రాణభయం తప్పదన్నది కూడా సత్య మేనా కాదా…
ఆయన జగమొండి అంట.. ఆయన వెనుకున్నది మొండి వారే నంట ఇది కూడా సత్యమేనా… కాదా…
ఆయన తలుచుకుంటే అడ్రెస్ కూడా గల్లంతైతదట ఇది కూడా సత్య మేనా ..కాదా…
ఆయన కుమ్మరించే కాసులంకోసం కావ్.. కావ్ అంటారంటా ఇది కూడా సత్య మేనా కాదా…
పవళింపు సేవలో ఫుడ్ కమిషన్ ఉందన్నదీ సత్యమేనా.. కాదా
మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నారన్నదీ సత్యమేనా.. కాదా
రక్షక భటులు భక్షక భటులయ్యారన్నదీ సత్యమేనా..కాదా…
కాసులిస్తే కలెక్టర్ కూడా కామ్ గా ఉంటాడన్నదీ సత్యమేనా.. కాదా…
జేబులునింపితే జేసీ కూడ జంప్ అవుతాడంటున్నదీ సత్యమేనా…కాదా…
ముడుపులిస్తే మంత్రులు కూడా మొక్కుతారన్నదీ సత్యమేనా… కాదా..
అక్రమ రవాణాను అసలు ఆపే దమ్ములేదన్నదీ సత్యమేనా… కాదా…
ఆయన కేక వేస్తే కాకలు తీరినవారు కూడా కామ్ అవ్వాల్సిందే అన్నదీ సత్యమేనా… కాదా..


ఎవరీ జయంతి పుష్ప…అక్కడ జరుగుతున్నది సత్యమేనా కాదా..
కథనం వస్తే ప్రాణాలు పోతాయన్నదీ సత్యమేనా…. కాదా..
ప్రాణం తీయడం సత్యం కాక పోతే ..పూర్తి వివరాలు త్వరలో…

సినిమా పేరు….పుష్ప3…షూటింగ్ జరిగే స్థలం…జయంతి గ్రామం…వీరులపాడు మండలం.. నందిగామ తాలుకా,ఎన్టీఆర్ జిల్లా..ముఠా సభ్యులు…70 మంది, 7 ఐచర్ లారీలు, 10 టైర్ల లారీలు.. అవసరాన్ని బట్టి కథ,డైరెక్టర్. నిర్మాత.,హీరో, విలన్..నిజానికి మరో పేరు…